ఒక్కసారిగా నదిలోకి కూలిపోయిన బ్రిడ్జి.. షాకింగ్ వీడియో

2985చూసినవారు
వియ‌త్నాంలో షాకింగ్ ఘటన జరిగింది. ఉత్తర వియ‌త్నాంలో ఉన్న ఓ బ్రిడ్జ్ ఒక్కసారిగా నదిలోకి కుప్పకూలిపోయింది. టైఫూన్ యాగి తుపాన్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తర ప్రావిన్స్ ఫూ తూలోని రెడ్ రివర్‌పై 30 ఏళ్ల క్రితం ఈ వంతెన నిర్మించారు. బ్రిడ్జ్‌ కూలిపోయిన సమయంలో దాని మీదుగా రాకపోకలు సాగిస్తున్న పలు కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో పది మందికిపైగా గల్లంతైనట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్