చెరువులో పడిన కారు.. వ్యక్తి మృతి

52చూసినవారు
చెరువులో పడిన కారు.. వ్యక్తి మృతి
తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో విషాద ఘటన జరిగింది. నర్సంపేట మండలం మాదన్నపేట వద్ద చెరువులో ఓ కారు ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ నేపథ్యంలో కారులో ఇరుక్కుపోయిన విష్ణు అనే వ్యక్తి మృతి ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. కారులోని మరో వ్యక్తి ప్రేమ్ చంద్ ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారును, వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్