మనిషిలోని సహనం సామాజిక శాంతికి కారణమవుతుంది. అదే మనిషిలోని అసహనం అల్లకల్లోలం సృష్టిస్తుంది. శాంతియుత నైతిక జీవనం సాగించేందుకు సహనం అనేది తప్పనసరి. అదే మానవత్వపు ఉత్తమ లక్షణం. మానవతావాదంలో ప్రేమకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. సూర్యరశ్మిలా ప్రేమానుభావం మానవ లోకాన్ని అలముకోవాలి. హ్యూమన్ మ్యూచువల్ కో ఆపరేషన్, అవగాహన నుంచి వచ్చేదే ప్రేమ. ఇదే మనిషి ఆటవిక ప్రవృత్తిని నాశనం చేసి, స్వార్థాన్ని నిర్మూలించి మనిషిని మనిషిగా నిలబెడుతుంది.