రైతుల కోసం భారీగా నిధులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

52చూసినవారు
రైతుల కోసం భారీగా నిధులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ సంబంధిత పథకాలకు రూ.14వేల కోట్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కోసం రూ. 2వేల కోట్లు, క్రాప్ సైన్స్‌కు రూ. 3వేల కోట్లు, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్‌మెంట్ రూ. 2వేల కోట్లు, లైవ్‌స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ రూ. 1702 కోట్లు, క్రిష్ విజ్ఞాన కేంద్రం రూ. 1202 కోట్లు, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌కు రూ. 1115 కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్