రైతుది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వం చేసిన హత్య: హరీశ్

83చూసినవారు
ఆదిలాబాద్ పట్టణంలో ICICI బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు ఘటనపై BRS నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రైతుది ఆత్మహత్య కాదు అని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి ఉంటే ఆ రైతు ఎందుకు చనిపోయే వాడు? అని ప్రశ్నించారు. బేల (M) సైదాపూర్ కు చెందిన రైతు జాదవ్ నాగోరావ్.. అప్పు కట్టాలని వేధింపులు గురికావడంతో శనివారం బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్