కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY) పథకం ద్వారా భార్యాభర్తలకు నెలకు రూ.10,000 పెన్షన్ అందిస్తోంది. 18-40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకానికి అర్హులు. భార్యాభర్తలిద్దరూ ఈ స్కీమ్‌లో చేరితే 60 ఏళ్లు దాటినప్పటి నుంచి నెలకు రూ.10,000 పొందవచ్చు. ఈ పథకం 2015లో ప్రారంభించారు. అన్ని నేషనల్ బ్యాంకులు అటల్ పెన్షన్ యోజనను అందిస్తున్నాయి.