జనరల్ బోగీలు తక్కువ ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే వారు ఏకంగా గొడవలకు దిగుతున్న సందర్భాలు ఉంటున్నాయి. ఓ రైలులో జనరల్ బోగీల్లో సీట్ల కోసం ప్రయాణికులు గొడవపడ్డారు. సికింద్రాబాద్ - రాయపూర్ S.F.ఎక్స్ ప్రెస్ లో మొత్తం 22బోగీలకు 2 మాత్రమే జనరల్ బోగీలు ఉండడంతో అందులో ఎక్కిన వారు సీట్ల కోసం గొడవపడ్డారు.