పక్కకు ఒరిగిపోయిన జెయింట్‌ వీల్‌.. (షాకింగ్ వీడియో)

58చూసినవారు
తమిళనాడులో పెను ప్రమాదం తప్పింది. ఒక పెద్ద జెయింట్‌ వీల్ ఉన్నట్టుండి ఒక పక్కకు ఒరిగిపోయింది. తిరుపత్తూరులో ఈ సంఘటన జరిగింది. పసిలికుడైలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆది పెరుక్కు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఆలయం వద్ద ఫెర్రిస్‌ను ఏర్పాటు చేశారు. అయితే 50 అడుగుల ఎత్తున్న జెయింట్‌ వీల్‌ తిరుగుతుండగా ఒక్కసారిగా ఎడమవైపునకు వంగిపోయింది. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి పిల్లలు, పెద్దలను సురక్షితంగా కిందకు చేర్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్