తమిళనాడు తిరుపొరూర్‌లోని మురుగన్ ఆలయానికి వెళ్లిన ఓ భక్తుడికి అనూహ్య ఘటన ఎదురైంది. హుండీలో కానుకులు వేస్తున్న సమయంలో పొరపాటున ఐఫోన్ కూడా హుండీలో పడిపోయింది. ఈ విషయాన్ని అతడు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా హుండీ నగదు లెక్కించే సమయంలో చూస్తామని చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం హుండీని తెరవగా ఐ ఫోన్ బయటపడింది. అయితే ఒక సారి హుండీలో పడిన వస్తువు దేవుడిదని, తిరిగి ఇవ్వడం కుదరదని చెప్పడంతో అతడు వెనుదిరిగాడు.