నడిరోడ్డులో బాలికపై లైంగిక వేధింపులు (వీడియో)

76చూసినవారు
బాలికలు, మహిళలకు తరచూ బహిరంగ ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వారిని రద్దీ ప్రాంతాల్లో కొందరు పోకిరీలు వేధిస్తుంటారు. ఇదే కోవలో ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో ఓ ఆకతాయి ఇటీవల నీచంగా ప్రవర్తించాడు. తల్లితో పాటు ఉన్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెను అనుచితంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్