మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మళ్లీ వాయిదా అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ‘గేమ్ ఛేంజర్ రిలీజ్ వాయిదా అని వస్తున్న వార్తలు ఫేక్. అవి నమ్మకండి. ముందు చెప్పినట్లుగానే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా తీసుకురాబోతున్నాం’ అని స్పష్టం చేశారు. ఈ మూవీతో రామ్ చరణ్‌తో పాటు, శంకర్‌ల ఇమేజ్ మారిపోతుందని, మూవీ బిగ్ సక్సెస్ అవ్వబోతుందని దిల్ రాజు తెలిపారు.