22 నె
లల బాలుడిని
ఇంటి ఓనర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో తన కారును ఎక్కించి చంపిన ఘటన మీర్పేట పీఎస్ పరిధిలో జరిగింది. ఇంటి వద్ద ఆడుతున్న దీక్షిత్ ను ఓనర్ దినేశ్ రెడ్డి కారుతో ఢీకొట్టాడు. అనంతరం అదే కారులో చికిత్స కోసం తీసుకెళ్లగా, ఆ చిన్నారి ఆస్పత్రిలోనే ప్రాణాలు వదిలాడు. ఆడుతూ కిందపడగా దెబ్బతగిలి చనిపోయాడని బాలుడి తల్లిదండ్రులను నమ్మించాడు. సీసీటీవీ ఫుటేజీ చూడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.