భారత్, ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పాండ్యా, జడేజా భాగస్వామ్యం ఎంతో ఆకట్టుకుంది. ఆరో వికెట్ కు వీరు ఆస్ట్రేలియాపై రికార్డును నెలకొల్పారు. అయితే వీరి భాగస్వామ్యం మరిన్ని మ్యాచ్‌లకు అవసరం అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు మిడిలార్డర్‌లో ద్రావిడ్, కైఫ్, ధోనీ, యువరాజ్ భాగస్వామ్యంతో ఎన్నో మ్యాచ్‌లు భారత్ గెలుపొందిందని చెబుతున్నారు. కావున ఇలా మిడిలార్డర్‌లో వచ్చిన బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకుంటే భారత్ మళ్లీ విజయాల పరంపర కొనసాగిస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.