గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.4200 కోట్లను బకాయి పెట్టిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తుందని, పీజీ విద్యార్థులకు కూడా ఈ సౌలభ్యం తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం నిర్వహించిన ఏపీ అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు.