83 మంది విద్యార్థులు చనిపోయారు: దుబ్బాక ఎమ్మెల్యే

66చూసినవారు
83 మంది విద్యార్థులు చనిపోయారు: దుబ్బాక ఎమ్మెల్యే
TG: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ‌లో ఆయన మాట్లాడారు. 83 మంది హాస్టల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఫుడ్ పాయిజనింగ్ , పాము కాట్లతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టి తీసుకొచ్చారు. దుబ్బాక నియోకవర్గంలో ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకుంటే.. ఆ విషయం బయటకు రాకుండా చేశారన్నారు.

సంబంధిత పోస్ట్