విదేశీ విద్య పథకానికి 1110 మంది ఎంపిక: మంత్రి సీతక్క

61చూసినవారు
విదేశీ విద్య పథకానికి 1110 మంది ఎంపిక: మంత్రి సీతక్క
TG: విదేశీ విద్య పథకానికి 1110 మంది ఎంపికైనట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 210 మంది ఎస్సీలు, 300 మంది బీసీలు, 100 మంది ఎస్టీలు, 500 మంది మైనార్టీ విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. ‘గత బకాయిలతో కలిపి రూ.167 కోట్లు చెల్లించామని, కాంగ్రెస్ వచ్చే నాటికి పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ బకాయిలు రూ.4,332 కోట్లు ఉన్నాయని, వాటిని త్వరలో చెల్లిస్తాం’ అని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్