గురుకుల విద్యార్థులకు గీజర్లు ఏర్పాటు చేయండి: ప్రభుత్వ విప్

83చూసినవారు
గురుకుల విద్యార్థులకు గీజర్లు ఏర్పాటు చేయండి: ప్రభుత్వ విప్
TG: రాష్ట్రంలోని గురుకులాల్లో గీజర్లు ఏర్పాటు చేయాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఇవాళ శాసనసభా సమావేశాల్లో పెంచిన కాస్మోటిక్, డైట్ ఛార్జీలపై సభలో మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల కొన్ని గురుకుల పాఠశాలలు పరిశీలించానని చెప్పారు. విద్యార్థులు వేకువజామునే లేచి చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్