బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి డబ్బులు పంపడంలో బిజీ అని, బీజేపీ-కాంగ్రెస్ రహస్య సమావేశాలపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. రేవంత్ వ్యవహారాలు, బీజేపీ నేతల బాగోతాలు తనకు తెలుసని, హైదరాబాద్ యూనివర్శిటీ ఆందోళనలపై రాహుల్ మౌనం వీడాలని డిమాండ్ చేశారు.