బాలికల రక్షణ మనందరి బాధ్యత...నేడు జాతీయ బాలికల దినోత్సవం

5674చూసినవారు
బాలికల రక్షణ మనందరి బాధ్యత...నేడు జాతీయ బాలికల దినోత్సవం
జాతీయ బాలికల దినోత్సవాన్ని జనవరి 24, న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం జనవరి 24న, సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి ఈ దినాన్ని నిర్వహిస్తుంది. బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్యా, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి 2008 సంవత్సరం నుంచి ప్రభుత్వం జాతీయ బాలికల దినోత్సవం జరుపుతోంది.

2011 సెన్సెస్‌ ప్రకారం దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది మహిళలు ఉన్నారు. 2001 సెన్సెస్‌ ప్రకారం వెయ్యిమంది పురుషులకు 933 మంది మహిళలు ఉండేవారు. 2011 సెన్సెస్‌ ప్రకారం 6 సంవత్సరాల లోపు ఆడపిల్లలైతే ప్రతి 1000 మంది మగ పిల్లలకు 914 మంది మాత్రమే ఉన్నారు.

దేశంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అబ్బాయే పుట్టాలనే ఆలోచన నుంచీ... అమ్మాయి పుట్టినా పర్వాలేదని సర్దుకుపోయే మనస్తత్వం కనిపిస్తోంది. అమ్మాయి పుడితే బాగుండు అనుకునే పరిస్థితికి మనం చేరాల్సి ఉంది. బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్‌మెంట్ మిషన్‘ పేరుతో కార్యక్రమం తెచ్చింది. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక... "బేటీ బచావో బేటీ పడావో" స్కీం తెచ్చారు. తద్వారా బాలికల చదువు, పెంపకంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ప్రతిబింబించకపోవడం విశారకరం. మన దేశంలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు సమానంగా సంఖ్యను పెంచాలన్నమాటలు మాటలు గానే మిగులుచున్నాయి. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు కొంతవరకే ఫలితాన్ని ఇస్తున్నాయి.

బాలికలకు ఉచిత విద్య అయినా, బాల కార్మిక వ్యవస్థను రూపు మాపడానికి వచ్చిన చట్టం అయినా, బాలబాలికలపై లైంగిక వేధింపులు నిరోధించడానికి వచ్చిన చట్టం అయినా, లింగనిర్థారణా నిషేధ చట్టం, పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, నిర్భయ చట్టాలు అన్నీ బాలికలను ఉద్ధరించడానికి తీసుకువచ్చినవే. ఇవే కాకుండా బాలికలకు కస్తూర్బా విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, మధ్యాహ్న భోజన పథకాలు తీసుకు వచ్చియి మన ప్రభుత్వాలు పంచవర్ష ప్రణాళికల ద్వారా సోషల్ వెల్ఫేర్ బోర్డులు, మహిళా మండలుల ద్వారా మహిళా సమస్యల పరిష్కారం, మహిళ, శిశు ఆరోగ్య రక్షణ, విద్య, పౌష్టికాహారం, మహిళా సంక్షేమం, అభివృద్ధి పథకాలు, లింగ నిష్పత్తి, స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబనలాంటి అనేక అంశాలతో రాజ్యాంగ రక్షణ కల్పించి ‘మహిళా పక్షపాత’ వైఖరితో వారి హక్కులను పరిరక్షించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాయి మన పాలక ప్రభుత్వాలు. అయిన అమ్మాయిల ఔన్నత్యాన్ని ఇంకా సమాజంలో పెంచవలసిన బాధ్యత ప్రభుత్వాలపై, అలానే సమాజంపై ఎంతో ఉంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న బాలికలపై లైంగిక వేధింపులు నిత్యకృత్యమైనాయి. పీడిత కులాల బాలికల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు? చెక్కలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలు అదృశ్యమైన సంఘటన, ప్రియాంక, భూమికల విషాదానికి బలపడుతున్న కుల వ్యవస్థ, దేశ వ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న మతోన్మాద దాడులూ ఒక కారణమంటే సత్యదూరం కాదు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్‌ బాలికలను నిర్బంధించి అత్యాచారం జరిపి హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి మూటగట్టి గుట్టల్లో విసిరేసిన దుర్మార్గమైన ఘటన వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా చెప్పుకుంటుపోతే లెక్కకు మిక్కిలిగా బాలికల బాటుకులకు రక్షణ కొరవడింది.

సంక్షేమ హాస్టళ్లలో మరియు కొన్ని అనాధ ఆశ్రమల్లో ఉంది విద్యనేర్చుకుంటున్న బాలికలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు, గర్భాలు ధరించడం, తరగతి గదుల్లోనే ప్రసవించడం లాంటి ఘటనలన్నీ నిత్యకృత్యమైనాయి. పీడిత కులాల బాలికలపై జరిగే ఈ అకృత్యాలకు,నిర్లక్ష్యానికి కారణం ఎవరు? ప్రభుత్వ హాస్టల్స్ లో ఉంటూ విద్యనభ్యసించే నలుగురు విద్యార్థులు గర్భం దాల్చడం కలకలం రేపింది. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లో చోటుచేసుకుంది. ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లో బాలికల వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. వీటిలోని రెండు హాస్టళ్లలో నలుగురు విద్యార్థులు గర్భం దాల్చినట్లు వైద్యులు గుర్తించి నివ్వెరపోయిన ఘటన చోటుచేసుకుంది.

ఐపీసీ 312 సెక్షన్‌ ప్రకారం గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని తెలిసి గర్భస్రావం చేయించిన బాధ్యులకు మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా.. మహిళ మరణిస్తే 10 ఏళ్ల జైలుశిక్ష ఉంది. 509 సెక్షన్‌ ప్రకారం విద్యార్థినీలు, మహిళలు, ఉద్యోగినుల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడినా, కించపరిచినా, సైగలు చేసినా సాధారణ జైలుశిక్ష జరిమానా ఉంది. సెక్షన్‌ 354 ప్రకారం అత్యాచారం చేయాలనే ఉదేశంతో ఎవరైనా మహిళపై దాడిచేస్తే రెండేళ్ల జైలుశిక్ష జరిమానా ఉంటుంది. సెక్షన్‌ 366 ద్వారా ఎవరైనా మహిళను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవాలనో, చేయించాలనో, వివాహేతర పెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రలోభాలకు గురిచేస్తే 10 ఏళ్ల జైలుశిక్ష ఉంది. 18 ఏళ్లలోపు యువతి ఆమె అనుమతితో లైంగిక సంబంధం పెట్టుకున్నా అత్యాచారంగానే పరిగణించి శిక్షిస్తారు.

సమాజంలో ప్రతిఒక్కరూ బాలికల ఉన్న అన్ని హక్కులను కాపాడుకోలేమా? ముందు మన దేశంలోని గొప్ప గొప్ప మహిళా సంఘ సంస్కర్తలు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, గురువులు, మహిళనేతలు, క్రీడాకారులు గా ఎన్నో రకాల సేవలు అందించేందుకు వారు చేసిన కృషి అభిలశనీయం. వారిలో ముక్యంగా జ్యోతిరావు పూలే, మథర్ థెరిసా, కల్పనా చావ్లా,పి టి ఉష వంటి వారి సేవలను గుర్తుంచుకొని, వారు చూపిన మార్గంలో నడుస్తూ, బాలికలను ఈ దేశంలో అన్నీ హక్కులతో జీవనం సాగించడానికి పాలక ప్రభుత్వాలు,సమాజంలోని ప్రజలు బాధ్యతతో సహకారం అందిద్దామని కోరుచున్నాను.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్