'చౌక దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ'

51చూసినవారు
'చౌక దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ'
గిరిజన ప్రాంతాల్లో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీకి స్వస్తి చెప్పినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఇక నుంచి చౌక దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో 960 చౌక దుకాణాలు పునరుద్ధిరిస్తామని తెలిపారు. గిరిజన వసతి గృహాల్లో ఏఎన్‌ఎంలను నియమించనున్నట్లు చెప్పారు. ఫీడర్ అంబులెన్సులు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను మళ్లీ తీసుకువస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. టీ టైమ్ లాగే జీసీసీ ద్వారా అరకు కాఫీ షాపులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్