ఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ప్రైవేట్‌ దవాఖాన సిబ్బంది

71చూసినవారు
ఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ప్రైవేట్‌ దవాఖాన సిబ్బంది
బైక్ అదుపుతప్పి కింద పడిన శ్రీను అనే యువకుడు కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్‌ ఫీజు రూ.300 చెల్లించి చూపించుకున్నాడు. గాయాలకు దవాఖాన సిబ్బంది కుట్లు వేసి డబ్బులు అడిగారు. డబ్బులు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా కడతానని చెప్పగా దవాఖాన సిబ్బంది నిరాకరించారు. అంతటితో ఆగకుండా యువకుడితోపాటు వెంట ఉన్న స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి యువకుడికి వేసిన కుట్లను విప్పేసి పంపించారు.

సంబంధిత పోస్ట్