కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినులు ఆందోళనను విరమించారు. హాస్టల్ వాష్ రూమ్ లో రహస్య కెమెరాలు పెట్టారంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో మంత్రి కొల్లు రవీంద్ర చర్చలు జరిపారు. ఈ ఘటనపై మంగళవారం నాటికి విచారణ పూర్తి చేస్తామని, ఎలాంటి వీడియోలు బయటకు రానీయకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్దినులకు రక్షణగా మహిళా పోలీసు టీంను ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి హామీ మేరకు విద్యార్థినులు ఆందోళన విరమించారు.