మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కొంతమంది దుండగులు ఆవులను ఉబ్బిన నదిలోకి వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటనలో దాదాపు 15-20 ఆవులు మృతి చెందినట్లు సాత్నా పోలీసులు బుధవారం తెలిపారు. వీడియో వైరల్ కావడంతో దాని ఆధారంగా నలుగురు నిందితులు బేటా బగ్రీ, రవి బగ్రీ, రాంపాల్ చౌదరి, రాజ్లు చౌదరిలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.