ఆవుపాలు పిండుతున్న వ్యక్తిని కాల్చిచంపిన దుండగులు

77చూసినవారు
ఆవుపాలు పిండుతున్న వ్యక్తిని కాల్చిచంపిన దుండగులు
బీహార్‌ రాజధాని పట్నాలో దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలో ఆవు పాలుపిండుతూ హత్యకు గురయ్యాడు. దనపూర్‌ ఏరియాలో ఝలన్‌ రాయ్‌ అనే 44 ఏళ్ల వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం కూడా ఇంటివద్ద ఆవుకు పాలు పిండుతుండగా.. బైకుపై వచ్చిన ఇద్దరు దండగులు ఆయనను కాల్చిచంపి పారిపోయారు. దుండగులు ఇళ్లలో ఉన్న వాళ్లను కాల్చిచంపుతున్నారని, తమకు రక్షణ కరువైందని స్థానికులు ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్