బుల్లితెర నటి, టాలీవుడ్ ఫేమస్ యాంకర్ సమీరా షెరీఫ్ మరోసారి తల్లి కాబోతోంది. ఈమె 2019లో అన్వర్ జాన్‌ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయింది. 2020లో అర్హాన్ అనే బాబుకు జన్మనిచ్చింది. కాగా ఇప్పుడు మరోసారి తల్లి కాబోతోంది. సమీరా ఆడపిల్ల, అభిషేకం, ముద్దు బిడ్డ, భార్యామణి, మూడు ముళ్ల బంధం వంటి సీరియల్స్‌లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా పలు చిత్రాల్లోనే నటించి మెప్పించింది.