దేశంలో ఇద్దరు ప్రధానులు తమ హయాంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేకపోయారు. మాజీ ప్రధాని గుల్జారీలాల్ నందా 13 రోజుల చొప్పున రెండుసార్లు ప్రధాని అయ్యారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ 1990 నవంబర్ 10 నుంచి 1991, జూన్ 21 వరకు 8 నెలలపాటు ప్రధానిగా ఉన్నారు. ఆగస్ట్ 15న వీరిద్దరి పాలనా కాలాలలో రాకపోవడంతో వీరికి ఎర్రకోట పై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం దక్కలేదు.