విషాదం.. కూతురు పెళ్లిలో గుండెపోటుతో తండ్రి మృతి

69చూసినవారు
విషాదం.. కూతురు పెళ్లిలో గుండెపోటుతో తండ్రి మృతి
TG: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కూతురు పెళ్లిలో తండ్రి గుండెపోటుతో మృతి చెందిన హృదయవిధారక ఘటన బిక్కనూరు(మం) రామేశ్వర్ పల్లిలో చోటు చేసుకుంది. కుడిక్యాల బాలచంద్రం(54) శుక్రవారం తన పెద్ద కూతురు మహాలక్ష్మీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. తాళికట్టే కొద్ది సమయానికి ముందు ఆయన ఒక్కసారిగా కుప్పకూలాడు. బాలచంద్రాన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్