పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్‌ను జస్టిస్ హేమంత్ ప్రచాక్ బెంచ్ విచారించనుంది. ఈ కేసులో మార్చి 23న సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ హైకోర్టును ఆశ్రయించారు.