కోల్‌కతాలోని హౌరాలో సహినా పర్వీన్ అనే ఓ మహిళ, తన భర్త నసీమ్ సర్దార్‌కు వైరల్ ఫీవర్ రావడంతో జ్వరానికి వాడాల్సిన మందులకు బదులుగా తన ప్రియుడైన ఫార్మసిస్ట్ షేక్ మోర్సెలిమ్ ఇచ్చిన క్యాన్సర్ మందులను వేసి హతమార్చిందని వార్తా కథనాలు తెలిపాయి. వీరిద్దరినీ శనివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు నసీమ్ జ్వరానికి క్యాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ డ్రగ్స్ ఇవ్వడంతో అతడి అవయవాలు విఫలమై మరణించాడు.