డ్యాన్స్ చేస్తూ కారు నడిపిన మహిళలు.. వీడియో వైరల్

72చూసినవారు
రీల్స్ మోజులో కొందరు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి రిస్కీ రీల్ చేస్తున్న ఇద్దరు మహిళల వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మహీంద్రా థార్ ఎస్‌యూవీని డ్రైవ్ చేస్తున్న మహిళతోపాటు ఆమె పక్కన కూర్చున్న మహిళ ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ ప్రమాదకరంగా కారును నడిపారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న మహిళ స్టీరింగ్ వదిలి స్టెప్పులేసింది. ఘజియాబాద్-ఢిల్లీ వెళ్లే మార్గంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ఆదేశించింది.

సంబంధిత పోస్ట్