దేశవ్యాప్తంగా IAS, IPS ఆఫీసర్ల 1,316 మరియు 586 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం (డిసెంబర్ 12) తెలిపారు. మంజూరైన మొత్తం 6,858 మంది ఐఏఎస్‌లలో 5,542 మంది అధికారులు 2024 జనవరి 1 నాటికి ఉన్నారని రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఖాళీగా ఉన్న 1,316 ఐఏఎస్ పోస్టుల్లో 794 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, 522 ప్రమోషన్ పోస్టులు ఉన్నాయని తెలిపారు.