భూమి మీద 6 ఖండాలే ఉన్నాయంటున్నారు ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ డెర్బీ పరిశోధకులు. 7 ఖండాలున్నాయన్నది ఇన్నాళ్లూ తెలిసిన విషయం. అయితే ఐస్‌లాండ్‌లోని అగ్నిపర్వత రాళ్లపై తాము చేసిన అధ్యయనం ప్రకారం ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాలు వేరు కాలేదని పేర్కొన్నారు. ఇంకా విడిపోయే దశలోనే ఉన్నాయని వివరించారు. వీటితో పాటు ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్ కూడా కలుపుకొని ఒకప్పుడు అతి పెద్ద ఖండం ఉండేదని వారు అంచనా వేశారు.