తాలిబన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాబూల్, దేశవ్యాప్తంగా ఇతర ప్రావిన్సులలో మహిళల బ్యూటీ సెలూన్‌లను నిషేధించింది. ఈ మేరకు మౌఖిక ఉత్తర్వులు జారీ చేసింది. తాలిబాన్ వైస్ అండ్ వర్చ్యుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహ్మద్ అకిఫ్ మహజర్ అక్కడి స్థానిక మీడియాతో తెలిపారు. అయితే ‘మగవారికి
ఉద్యోగాలు ఉంటే మేము ఇంటి నుంచి బయటకే రాము. ఇప్పుడేం చేయాలి? మేము ఆకలితో చనిపోవాలి’ అని మేకప్ ఆర్టిస్ట్‌లు మండిపడుతున్నారు.