తెలంగాణలో అంగన్ వాడీ కేంద్రాలకు చేసే పాల సరఫరాలో ఎటువంటి గ్యాప్స్ లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీచేశారు. మారుమూల ప్రాంతాల్లోని అంగన్ వాడీ కేంద్రాలను పాల సరఫరా జరగాల్సిందేనన్నారు. సచివాలయంలో శనివారం అంగన్ వాడీ కేంద్రాలకు జరుగుతున్న పాల సప్లైపై మంత్రి సమీక్షించారు. గర్భిణీలు, బాలింతలకు పోషకాహరం అందించే లక్ష్యంతో ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.