AP: ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఎలాంటి మార్పులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫస్టియర్ పరీక్షలు కాలేజీలు నిర్వహించి, సెకండియర్ ఎగ్జామ్స్ బోర్డు నిర్వహించాలన్నది ప్రతిపాదన అని తెలిపింది. జనవరి 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఆ తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.