శీఘ్ర స్కలనం కాకుండా ఉపయోగపడే చిట్కాలివే

292478చూసినవారు
శీఘ్ర స్కలనం కాకుండా ఉపయోగపడే చిట్కాలివే
ఎక్కువ శాతం మంది పురుషులు ఎదుర్కొనే సమస్యల్లో శీఘ్రస్కలనం ఒకటి. కొంత మంది వారి జీవిత సహచరణితో కలిసి శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒక నిముషం లోపల స్కలనం జరుగుతుంది. మరికొందరు వారు అనుకున్నదానికంటే ముందే స్కలనం జరుగుతుంది. ఇలా ఆరు నెలల సమయంలో 70 నుంచి 80 శాతం సార్లు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఎక్కువగా శీఘ్ర స్కలనం వంటి సమస్య ఉత్పన్నం అవుతుంది. దాని వల్ల మగవారికి చిరాకు, నిరాశ, నిస్పృహ వంటి భావనలు కలిగి దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుంది.శీఘ్రస్కలనంలోనూ రకాలు ఉన్నాయి. శృంగార ప్రారంభ సమయంలో స్పందన వేగంగా కలిగి క్లైమాక్స్‌కు వెంటనే చేరడం ద్వారా కొందరు స్కలనం చేస్తారు. మరికొందరు వారు అనుకున్న సమయానికి స్కలనం జరుగుతుంది. త్వరగా స్కలనం జరగడానికి టెన్షన్‌కు గురవడం, వేరే ఫిజికల్ ప్రాబ్లమ్స్ కలిగి ఉండటం కారణమై ఉండొచ్చు.మరీ ముఖ్యంగా మొదటి సారి శృంగారంలో పాల్గొనే వారు వారికే తెలియకుండా ఒత్తిడికిలోనై త్వరగా స్కలనం జరుగుతుంటుంది. ప్రారంభించిన కొద్ది సెకన్లకే క్లైమాక్స్ దశకు చేరుకుంటుంటారు. అంతేకాకుండా, మొదట జరిగిన అనుభవం మళ్లీ రిపీట్ అవుతుందన్న భయం, సరిగ్గా చేయలేనేమోనన్న ఆందోళన, సహచరిణిని తృప్తి పరచలేనేమోనన్న భావన పెరిగి వారు కొంత ఒత్తిడికి లోనవుతుంటారు.

అటువంటి వారు వారికై వారే డిప్రెషషన్‌కు ఏమైనా గురయ్యారా..? వారికి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా..? థైరాయిడ్ ఇన్‌బ్యాలెన్స్ వంటి సమస్యలేమైనా ఉన్నాయా..? అన్న విషయాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.శృంగారంలో సహచరిణి తృప్తిపడకపోవడంతో ఆమె తనను విడిచివెళ్లిపోతుందేమో.., తనకు దూరమవుతుందేమో.., విడాకులు ఇస్తుందేమో.., ఇలా అనేక అనుమానాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. శీగ్ర స్కలన సమస్యను మైల్డ్, మోడరేట్‌, సివియర్ ఇలా మూడు రకాలుగా విభజించారు. 30 నుంచి నిముషం లోపల స్కలనం జరగడాన్ని మైల్డ్ వెరైటీ అటారు. అలాగే 15 నుంచి 30 సెకన్లలోపు స్కలనం జరిగితే దాన్ని మోడరేట్ అంటారు. 15 సెకన్ల లోపే జరిగితే దానిని సివియర్స్‌ అంటారు.

ఇలా ప్రతి విషయాన్ని ఎనాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇటువంటి సమస్యకు పరిష్కారంగా సైకో థెరపీ, ఫామ్కో థెరపిని వైద్యులు సూచిస్తున్నారు. ఉదాహరణకు స్టార్ట్ స్టాప్ టెక్నిక్ వంటివి చేయడం వలన శీఘ్రస్కలన సమస్య నుంచి కొంత వరకు నివారణ పొందే అవకావం ఉంది. దాంతోపాటు ఆతృత, స్ట్రెస్ ఉంటే రిలాక్సేషన్ ఎక్సర్‌సైజ్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ వంటి వాటితో సమస్య నుంచి రిలీవ్ చేయొచ్చు. పూర్తి సమాచారం కోసం వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.అలాగే, ఈ సమస్య నుంచి బయట పడాలనుకుంటున్న వారు ప్రకృతి వైద్య పరంగా ఈ చిన్న చిట్కాను పాటిస్తే వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో కొనసాగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వారు చెబుతున్న దాని ప్రకారం ముందుగా తెల్ల నువ్వులు, బెల్లం పదార్ధాలను సిద్ధం చేసుకోవాలి. ఒక అరకప్పు తెల్ల నువ్వులను రోలులో వేసి కచపచగా దంచాలి.అలా దంచిన మిశ్రమానికి కప్పు బెల్లం కలిపి మెత్తగా నూరాలి. ఇలా రెండు మిశ్రమాలు కలిసిపోయాక దాన్ని చిన్న లడ్డూల మాదిరి తయారు చేకోవాలి. వాటిని ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత ఒక లడ్డూ, రాత్రి భోజనం చేశాక ఒక లడ్డూ ఇలా నెల రోజులపాటు తీసుకుంటే శృంగార శక్తి పెరిగి శీఘ్రస్కలన సమస్య తగ్గుతుంది. అలాగే అంగస్తంభన సమస్యలు తగ్గడంతోపాటు శృంగార జీవితం ఎంతో ఆనంద భరితంగా మారుతుంది.

సంబంధిత పోస్ట్