ఇవి ఎగ్జిట్‌ పోల్స్‌ కాదు.. ఎగ్జాక్ట్‌ పోల్స్‌: సీఎం రమేశ్‌

84చూసినవారు
ఇవి ఎగ్జిట్‌ పోల్స్‌ కాదు.. ఎగ్జాక్ట్‌ పోల్స్‌: సీఎం రమేశ్‌
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సైతం ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తోందని జోస్యం చెప్పారు. ఏపీలో ఐదేళ్లుగా ప్రజలు పడ్డ కష్టాలు తీరబోతున్నాయని, ఇవి ఎగ్జిట్‌ పోల్స్‌ కాదు.. ఎగ్జాక్ట్‌ పోల్స్‌ అంటూ వ్యాఖ్యానించారు. ‘ప్రజలు మార్పు కోరుకున్నారు.. అదే జరిగి తీరుతుంది’ అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్