నా రిటైర్‌మెంట్‌కి కారణం అదే: దినేశ్ కార్తీక్

80చూసినవారు
నా రిటైర్‌మెంట్‌కి కారణం అదే: దినేశ్ కార్తీక్
తన రిటైర్‌మెంట్ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని తాజాగా భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. ‘నేనెప్పుడు బరిలోకి దిగినా వంద శాతం నిబద్ధతతో ఆడేందుకు ప్రయత్నిస్తా. ఫిట్‌నెస్ పరంగా మరో మూడేళ్లు క్రికెట్ ఆడగలను. కానీ, మానసికంగా మాత్రం ఫిట్‌‌గా లేని సందర్భాలు ఉన్నాయి. మానసికంగా ఫిట్‌గా లేకపోతే మైదానంలోకి దిగకూడదు. బయటి వారికి ఇవేవీ తెలియకపోవచ్చు. కానీ, ఓ క్రికెటర్‌కు అర్థమవుతుంది’ అని కార్తీక్ అన్నాడు.

సంబంధిత పోస్ట్