అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తన మ్యానిఫెస్టోలో కీలక గ్యారెంటీలను ప్రకటించింది. ఉద్యోగాల కల్పన, మహిళలకు నెలకు రూ.2,100, 60 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం, 24 గంటల నీటి సరఫరా, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, ఢిల్లీ మెట్రోలో 50 శాతం రాయితీ, పూజారులు, గ్రంథీలకు రూ.18 వేలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.లక్ష అందజేత తదితరవి ఇందులో ఉన్నాయి.