బన్నీ నటించిన ‘పుష్ప2: ది రూల్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ రీలోడెడ్ వెర్షన్‌ను డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం రూ.1896 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.