ఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో ఆలయ ప్రాంగణంలో వీడియోలు చిత్రీకరించకుండా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై నిషేధం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఎవరైనా రీల్స్ లేదా కంటెంట్ తయారు చేస్తున్నట్లు తేలితే వారి దర్శనాన్ని నిషేధించి, వెంటనే వెనక్కి పంపుతామని కేదార్‌నాథ్-బద్రీనాథ్ పాండా సమాజ్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని అధికార యంత్రాంగానికి తెలిపారు.