ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్: మమతా బెనర్జీ

71చూసినవారు
ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్: మమతా బెనర్జీ
కేంద్ర బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అన్నారు. ఇందులో రాజకీయ లక్ష్యం మాత్రమే ఉందన్నారు. పేదలకు, మధ్యతరగతి వారికి ఈ బడ్జెట్ వ్యతిరేకంగా ఉంది. ఇది ఒక పార్టీని సంతృప్తి పరచడానికి ఉద్దేశించిన బడ్జెట్. ఈ బడ్జెట్‌లో నాకు ఎలాంటి అభివృద్ధి కనిపించడంలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎన్డీయే మరిచిపోయింది’’అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్