ఇంగ్లిష్‌లో స్పీచ్‌తో అదరగొట్టిన మహిళా సర్పంచ్ (వీడియో)

72చూసినవారు
ఓ కుగ్రామానికి సర్పంచ్ మహిళ అయితే, ఆమె కేవలం సాధారణ చదువులు పూర్తి చేసిందని భావిస్తాం. అయితే రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఇటీవల ఓ మహిళా సర్పంచ్ ఇంగ్లిష్‌‌లో స్పీచ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. జిల్లా కలెక్టర్, ఐఏఎస్ అధికారిణి టీనా దాబీకి ఆహ్వానం పలుకుతూ ఇంగ్లిష్‌లో సర్పంచ్ సోను కన్వర్ ప్రసంగించింది. నీటి సంరక్షణపై ఆమె ప్రసంగం టీనా దాబీని సైతం ఆకట్టుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్