మన్మోహన్‌ సింగ్‌కు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత నివాళి

55చూసినవారు
మన్మోహన్‌ సింగ్‌కు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు మన్మోహన్‌ సింగ్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఢాకాలోని భారత హైకమిషన్‌ను సందర్శించిన యూనస్‌.. అక్కడ మన్మోహన్‌ సింగ్‌ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం అక్కడి సంతాప పుస్తకంలో సంతాప సందేశాన్ని కూడా రాశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్