కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా అతి చెత్త రికార్డును మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు కుప్పకూలిన
భారత్ ఒక్క పరుగు చేయకుండానే చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 153/4 స్కోర్‌తో పటిష్టంగా కనిపించిన టీమిండియా అనంతరం 11 బంతుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది. టెస్ట్
క్రికెట్ చరిత్రలోనే ఇలా ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.