TG: ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మంత్రివర్గంలో ముగ్గురు మంత్రుల పని తీరుపై అధిష్టానం, సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ ముగ్గురిని తొలగించడానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో మంత్రి కొండా సురేఖ, మంత్రి జూపల్లి కృష్ణారావులతోపాటు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం.