డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు

66చూసినవారు
డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
తెలంగాణ డీజీపీ పేరుతో ఓ వ్యాపారవేత్త కూతురికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. డ్రగ్స్ కేసు నుంచి బయటపడేయాలంటే రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సదరు వ్యాపారవేత్త సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో కాల్ వచ్చినట్లు.. ఇది పాకిస్తాన్ కోడ్ అని పోలీసులు గుర్తించారు. నిందితుల వాట్సాప్ డీపీకి డీజీపీ రవి గుప్తా ఫొటో పెట్టినట్లు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్