వీధి కుక్కను కర్రలు, క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన ముగ్గురు యువకులు (వీడియో)

51చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు యువకులు అత్యంత కిరాతకంగా ఓ వీధి కుక్కను కొట్టి చంపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. లక్నోలో ఈ ఘటన జరిగింది. ఓ వీధిలో ముగ్గురు యువకులు క్రికెట్ బ్యాట్, కర్రలను పట్టుకుని కుక్కను దారుణంగా కొట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో జంతు హక్కుల కార్యకర్త రేషమ్ తల్వార్ అషియానా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్