తన ప్రత్రికల ద్వారా నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా రాశారు. బాల్యవివాహాలను నిరసించి.. వితంతు వివాహాలను స్వాగతించారు తిలక్. శివాజీ జయంతులు, గణేష్ ఉత్సవాలు నిర్వహించారు. స్వాతంత్య్ర ఉద్యమం కోసం భారత జాతిని జాగృతం చేయాలని చూశారు. తన తుదిశ్వాస వరకు జాతీయ చైతన్యం కోసం, దేశ స్వాతంత్య్రం కోసం పరితపించిన మహనీయునుడు తిలక్.