నోటీసులు, విజ్ఞప్తుల తర్వాత దేశానికి

62చూసినవారు
నోటీసులు, విజ్ఞప్తుల తర్వాత దేశానికి
ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం వల్ల ఆయన గత ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. ఈ నేపథ్యంలోనే రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన జాడ కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, రెడ్‌ కార్నర్‌, బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని దేవెగౌడ, కుమారస్వామి కోరడంతో స్వదేశానికి వచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్